ఓఆర్ ఆర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

  • ఆగివున్న లారీని ఢీకొన్న కారు
  • ముగ్గురి దుర్మరణం

శంషాబాద్: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగంది. అవుటర్ రింగ్ రోడ్డు పై వాహనంలు ఆగకూడదు అన్న నిషేధం ఉన్నా నిబంధనలు బేఖాతరు చేసి లారీ ఆపు కోవడం ముగ్గురుని బలిగొన్నాది. వర్షం పడుతుండడంతో లారీ రోడ్డుపై ఆపి ఉందని గమనించలేదు. అదుపు తప్పి ఒక్కసారిగా క్రెటా కారు లారీని బలంగా ఢీకొనడంతో కార్లోనే ముగ్గురు చనిపోయారు.

తిరుపతి వెళ్లి, తిరుపతి నుండి శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు తుక్కుగూడ వైపు నుండి పటాన్ చెరువు వైపు వెళ్తుండగా సంఘటన జరిగింది. ఓంకార్ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన వాహనం ఆగి ఉండడంతో వెనకాల నుండి కారు అదుపు తప్పి ఢీకొట్టడంతో సంఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది పోలీసులు ఇరుక్కుపోయిని వారిని బయటకు తీసారు.

Leave A Reply

Your email address will not be published.