హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ తెల్లవారుజామున కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కారులో వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్‌పై మాదాపూర్ నీరూస్ సిగ్నల్ వద్ద బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని ముజీబ్‌గా గుర్తించారు. పాయింట్ బ్లాంక్‌లో మొత్తం ఆరు రౌండ్లు కాల్చడంతో ఇస్మాయిల్ కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా కాల్పులు మోతెక్కడంతో ఆ దారిన వెళ్తున్న వాహనదారులు భయంతో వణికిపోయారు. స్థిరాస్తికి సంబంధించిన గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడు ముజీబ్ కోసం గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.