ప్రోటోకాల్ విస్మరించడం సరికాదు

కమాన్ పూర్, (ఎఫ్ బి తెలుగు): ప్రోటోకాల్ ను విస్మరించి శ్రీధర్ బాబు పేరు శిలాఫలంలో ఎక్కడో వేయడం సరికాదని రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట చంద్రయ్య అన్నారు.రామగిరి మండలం స్థానిక శ్రీ పాద భవన్ ఐఎన్టియు ఆఫీసులో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయపల్లి గ్రామంలో డి ఎం ఎఫ్ డి ఎఫ్డినిధులతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో శిలాఫలకంపై ఈ ప్రాంత ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే డి ఎం ఎఫ్ డి ఫండ్స్ లో కమిటీ మెంబర్ అయినా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు ప్రోటోకాల్ పాటించకుండా అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు భయాలకు తలోగ్గి అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఎక్కడో కింద వేయడం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రోటో కాల్ పాటించని అధికారులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అధికారమనేది ఎప్పుడు ఒకరికే శాశ్వతం కాదు. అధికారమనేది ఈరోజు ఒకరికి ఉంటుంది రేపు మరొకరిగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి ఫోటో కాల్ పాటించని అధికారులపై ఉన్నతాధికారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తాం రాజకీయాలకు అధికారులకు ఎటువంటి సంబంధం లేనప్పుడు పెట్టిన శిలాఫలకాన్ని పున పరిశీలించి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఉండాలో అక్కడ ఏర్పాటు చేయాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం.

ఎక్కడ లేని విధంగా ప్రోటోకాల్ విలువలను పక్కనపెట్టి సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన రామగుండం కానీ మంచిర్యాల కానీ భూపాల్ పల్లి కానీ కొత్తగూడెం కాని అక్కడ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఎమ్మెల్యేలకు ఏ లాంటి ప్రోటోకాల్ ఉందో సింగరేణి ప్రాంతమైన మంథని ప్రాంత ఎమ్మెల్యే కూడా అలానే ప్రోటోకాల్ ఉంటుందని విషయం గుర్తుంచుకోవాలని అక్కడ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఎమ్మెల్యేల నీ అధికారులు అక్కడో ప్రోటోకాల్ మంథని ప్రాంత ఎమ్మెల్యేకు ఒక ప్రోటోకాల్ ఇవ్వడం ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్న అధికార పార్టీ నాయకుల భయానికి ప్రలోభాలకు తలోగ్గి ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని నిరంతరం మంథని నియోజకవర్గంలోని సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల అవసరాల కోసం రోడ్లు డ్రైనేజీలు ప్రజల అవసరార్థం వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని అటు అసెంబ్లీలో కానీ సింగరేణి అధికారులతో కమిటీ మీటింగ్లో మాట్లాడుతూ నిధులు రావడంలో కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి శ్రీధర్ బాబు అలాంటి వ్యక్తిని కొంతమంది అధికార పార్టీ నాయకులు ఎక్కడ ఆయనకు శిలాఫలకంలో పేరు ఉంటే ఎక్కడ పేరు వస్తుందో అని భయంతో ప్రారంభోత్సవంలో పిలవకుండా శిలా పలకలపై పేరు చివర్ల వేస్తే ప్రజలు గమనిస్తున్నారు శిలాఫలకాలపై మీరు పేరు పెట్టిన పెట్టకున్నా శ్రీధర్ బాబు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారనే విషయం గుర్తుంచుకోవాలని ఇకనైనా ఇలాంటి దిగజారు చర్యలను చేయకుండా ప్రారంభోత్సవాలు శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధను పక్కన పెట్టి శ్రీధర్ బాబు మంథని నియోజక ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం నిరంతరం పనిచేయండి అప్పుడు జనం ఇచ్చే తీర్పు ఇద్దరం స్వీకరిద్దాం.

ఇలాంటి చర్యలు ఇకనైనా మానుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అధికార పార్టీ నాయకులకు ప్రోటోకాల్ పాటించని అధికారులకు అధికారం ఎప్పుడూ ఒక్కరికే శాశ్వతం కదా అనే విషయాన్ని మరొకసారి గుర్తుంచుకోవాలని మీపై ఎవరైనా ఒత్తిడి చేసిన భయభద్ర గురిచేసిన మీ ఉన్నది అధికారులకు ఫిర్యాదు చేయాలి అంతేకానీ ప్రోటోకాల్ పాటించకుండా చేసే మీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రయ్య మంథని అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ పన్నూర్ ఎంపీటీసీ చిందం మహేష్ మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల శ్రీనివాస్ రామయ్య పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు ఆరెల్లి శ్రీనివాస్ రైతు సంఘం అధ్యక్షులు ఉడుత శంకర్ చందనాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రవెల్లి పురుషోత్తమరావు నాయకులు వెంకటేష్ సిద్ధం రామనారాయణ మోత్కూరి వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.