మనో నిబ్బరం కోల్పోవద్దు.. జీవ‌న్ రెడ్డికి కేసీఆర్ సూచ‌న‌

సొంత పార్టీకి చెందిన నేత నుంచి ఎదురైన హ‌త్యాయ‌త్నం నుంచి త్రుటిలో త‌ప్పించుకున్న టీఆర్ఎస్ కీల‌క నేత‌, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిని సీఎం కేసీఆర్ బుధ‌వారం రాత్రి ప‌రామ‌ర్శించారు. సీఎం ఆదేశాల మేర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్లిన జీవ‌న్ రెడ్డితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా హ‌త్యాయ‌త్నం గురించిన వివ‌రాల‌ను జీవ‌న్ రెడ్డి నుంచి కేసీఆర్ తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మ‌నో నిబ్బ‌రం కోల్పోవ‌ద్దంటూ జీవ‌న్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. త‌న భార్య‌కు సర్పంచ్ ప‌ద‌వి ఇప్పించ‌లేద‌న్న కార‌ణంతో టీఆర్ఎస్‌కు చెందిన ఓ గ్రామ స్థాయి నేత… జీవ‌న్ రెడ్డిని హ‌త్య చేసేందుకు య‌త్నించిన సంగతి తెలిసిందే. అయితే త‌న‌ను హ‌త్య చేసేందుకు నిందితుడు త‌న ఇంటికి వ‌చ్చిన స‌మ‌యంలో జీవ‌న్ రెడ్డి మేల్కొని ఉండ‌టంతో ఆ ప్ర‌మాదం నుంచి జీవ‌న్ రెడ్డి త‌ప్పించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.