జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఆయన తెలిపారు.

వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని… పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.