ప్రతి ఒక్కరు ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేద్దాం

భారత స్వతంత్ర దినోత్సవ 75వ వేడుకలలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ కోరారు. వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో భారత స్వతంత్ర వజ్రోత్సవాలలో లో భాగంగా మంగళవారం రోజు కాలనీవాసులకు ప్రభుత్వం తరపున జాతీయ జండల పంపిణీ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ పాల్గొని కలనిలోని ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిల్ కలెక్టర్ నరసింహ, మున్సిపల్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.