సినిమా హీరో లుక్కులో తెలంగాణ మంత్రి… ఫొటోలు, వీడియో ఇవిగో

టీఆర్ఎస్ నేత‌, రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఖద్ద‌రు వ‌దిలేసి… ఎంచ‌క్కా సినిమా హీరోలా మారిపోయిన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. ఎక్క‌డికెళుతున్నారో తెలియ‌దు గానీ… ఓ గంట క్రితం ఓ విమానంలో క‌నిపించిన శ్రీనివాస్ గౌడ్‌… మ‌రికాసేప‌టికే ఎక్క‌డో మెట్రో రైల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రెడ్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్‌, బ్లూ క‌ల‌ర్ జీన్స్‌, భుజంపై బ్లేజ‌ర్ వేసుకుని క‌నిపించారు.

ఇలా సినిమా హీరో లుక్కులో క‌నిపిస్తున్న త‌న ఫొటోలు, వీడియోను శ్రీనివాస్ గౌడే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమాన ప్ర‌యాణంలో భాగంగా టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన రెజ్ల‌ర్ ర‌వి కుమార్ ద‌హియాతో క‌నిపించారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే మెట్రో రైల్‌లో క‌నిపించిన ఆయ‌న‌.. చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు.

 

Leave A Reply

Your email address will not be published.