ఒగ్గుడోలు, డప్పు చప్పుడు తెలంగాణ గుండె చప్పుడు

మంథని (ఎఫ్ బి తెలుగు): తెలంగాణ ఒగ్గుడోలు,డప్పు చప్పుడు ద్వారానే ఢిల్లీ గద్దె ను కదిలించగలిగామని అందుకే ఒగ్గు డోలు,డప్పు చప్పుడు తెలంగాణ గుండె చప్పుడు గా గౌరవిస్తూన్నామని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని పట్టణంలో ని శ్రీ వాసవీ కన్యకపమేశ్వరి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ, ఒగ్గురత్న కావటి మల్లయ్య ఒగ్గు కళ సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాకళల పరిరక్షణలో భాగంగా ఒగ్గు డోలు శిక్షణ ముగింపు ఉత్సవం-2022 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథు లుగా పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం ఉంటాం విడివిడిగా ఉంటే ఒక రకం సమూహం అయితే ఒక రకం దేశంలో, ప్రపంచంలో సమూహనికి ఉన్న విలువ విడివిడిగా ఉంటే ఉండదన్నారు. సంతోషంగా డప్పు వింటే,డోలు వింటే ఆ అనుభూతి వేరు, ఆ ఆనందం వేరని,ఈ కళను ముందుకు తీసుకోవాలని ఉద్దేశం లో భాగంగా ఈ పత్రాలను కూడా ఒక్క నమ్మకం ఐడెంటి కార్డ్ ఉంటే ఒక్క ధేర్యం అన్నారు. ఇవాళ ప్రభుత్వ ఆమోదం తోని పత్రం ఉంటే అ గౌరవం గొప్పగా ఉంటుందని, కావటి సతీష్ పీహెచ్డీ చేస్తూ ఏ కులాన్ని, ఏ ఒగ్గు కథ అయితే నమ్ముకున్న డో ఆ కథ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుకుంటూ ఒక్క పద్ధతి లో ముందుకు తీసుకు వెళ్తుండడం ఆనందకరమన్నారు. మన ఆచారాలు, మన నడక మనకు అన్నం పెట్టాలే,ముందుకు నడిపించాలే అన్నారు.

హైదరాబాద్ లో బోనాల కార్యక్రమంలో ఎక్కడ చూసినా ఒగ్గు డోలు కళాకారులే ఏ కార్యక్రమం గ్రాండ్ ఉండాలంటే అక్కడ ఒగ్గు డోలు కళాకారులు ఉంటారన్నారు. హైదరాబాద్ కు రాష్ట్రపతి అభ్యర్థి వస్తే ఒగ్గు డోలు కళాకారుల ఘన స్వాగతం పలికరాని,గ్రాండ్ లూకింగ్ కు ఒగ్గు డోలు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. అనంతరం శిక్షణా కళాకారుల కు ప్రశంస పత్రాలను అందజేశారు, కుల పెద్ద మనుషులను మరియు శిక్షణా ఇచ్చిన కళాకారుని సన్మానించారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్-శైలజ దంపతుల ను సతీష్ బృందం మరియు కళాకారులు సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.