వ్యాపార సంస్థలుగా మారినా ప్రైవేట్ విద్యాలయాలు..

చదువు కొనలేక’ ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

చొప్పదండి: ప్రైవేట్ విద్యాలయాలు పూర్తిగా వ్యాపార సంస్థలుగా మారడంతో విద్యార్థులు “చదువు కొనలేక” ఇబ్బంది పడుతున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రభావంతో పూర్తిగా విద్యాసంస్థలు మూసివేయడం వల్ల విద్యార్థులు ఇంటికే పరిమితమై చదివిన చదువును మరిచిపోవడం కాక ఆటపాటలకు అలవాటు పడ్డారు దీనితో పాటు కరోనా ప్రభావంతో ఎలాంటి పని లేకుండా ఉండడంవల్ల ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు కొంత కోలుకుంటున్న తరుణంలో విద్యాసంస్థలు పున ప్రారంభం చేశారు.విద్యార్థులు కొత్త కొంత కాలంగా విద్యను కోల్పోయి బాధపడుతున్న సమయంలో విద్యాసంస్థలు2022_2023 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లను తీసుకుంటుండగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు వినడానికి భయంకరంగా మారిందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనికి తోడు ఆయా విద్యాసంస్థలలోనే పాఠ్యపుస్తకాలు నోటుబుక్కులు మరియు విద్యార్థుల యూనిఫామ్ బట్టలు బెల్టులు బ్యాడ్జ్ తదితర విద్యార్థులకు కావలసిన పూర్తిస్థాయి సామగ్రిని వ్యాపార సంస్థలుగా విద్యాసంస్థలలో అమ్మడంతో పాటు వారి ఇష్టానుసారంగా రేట్లకు విద్యార్థుల తల్లిదండ్రులు విధి లేక కొనాల్సిన పరిస్థితి నెలకొంది దీనిపై ప్రభుత్వం నియంత్రణ కరువైంది. జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి తనిఖీలు విద్యాసంస్థలపై నియంత్రణ, పరిశీలన చేయడంలో పూర్తిగా విద్యాశాఖ యంత్రాంగం విఫలమైందని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. పాఠశాలలో వ్యాన్ ఫీజులు స్పెషల్ ఫీజులు డొనేషన్లు ఇలా ఎన్నో రకాలుగా ఫీజులను గుంజు తున్నారు.

ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్టు చూస్తున్నారు. చాలీచాలని ఆదాయంతో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు సంపాదించిన ఆదాయం పిల్లల చదువులకు సరిపోవడంలేదని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు వారి ఆవేదనను తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు మామూళ్లకు ఆశపడకుండా అన్ని విద్యాసంస్థలపై నిఘా పెట్టి ఫీజులపై పాఠశాలల్లో విద్యాసంస్థల్లో బట్టలు పుస్తకాలు తదితర సామాగ్రి అమ్మడం వంటి వ్యాపారాలపై నియంత్రణ తీసుకురావాలని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.