ఘనంగా సత్య శ్రీ జ్ఞాన సాయి పాదుకా మందిర ద్వితీయ వార్షికోత్సవం: డా” భరత్ గురూజీ

ఎల్బీనగర్: సత్య శ్రీ జ్ఞాన సాయిపాదుకా మందిర ద్వితీయ వార్షికోత్సవ హయత్ నగర్ సాయినగర్ గ్రామ పంచాయితీలో గల జ్ఞాన సాయి పాదుకా మందిర ద్వితీయ వార్షికోత్సవం డా భరత్ గురూజీ ఆధ్వర్యంలో జరిగినది వార్షికోత్సవం సందర్భంగా 4-7-22న సాయి బాబావారీ అకండ నామ సంకీర్తన 5-7-22 న బాబా వారి పాదుకలకు పంచామృత అభిషేకం రుద్ర నమక చమకలతో పలు నది జలలతో వివిధ పుష్పాలతో పూజ మరియు శ్రీ చక్ర కుంకుమార్చన యదా విధిగా 4 హారతులు భజన అంగ రంగ వైభవంగా జరప బడింది శ్రీ సాయి అన్నపూర్ణా సేవ ట్రస్ట్ లో ప్రతి రోజు లాగానే అన్న ప్రసాదం అందరికి అందించడం జరిగింది.

అలాగే ఎంతో మంది ప్రముఖులు సాయి పాదుకలు దర్శించి ఎంతో తన్మయం పొందారు. పూజ్యశ్రీ జగన్ గురూజీ మరియు డాక్టర్ విజయలక్ష్మి ( ఆలయ చైర్ పర్సన్) చేతుల మీదుగా జ్ఞానసాయి పాదుకా మొమెంటో ఆవిష్కరించారూ. జగన్ గురువు అన్నము ఆరోగ్యము హిందు ధర్మము ఒకే చోట ఉండటం ఎంతో ఆనందం కలుగ చేసిందని తెలియచేసారు. ఈ వేడుకలు పాలుపంచుకున్న సాయి బంధువులు మరియు పాత్రికేయులకు డాక్టర్ భరత్ గురూజీ ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.