మహాధర్నాను విజయవంతం చేయాలి: రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు శంకర్ పెద్దపల్లి

ఈ నెల 7న హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రఘు శంకర్ రెడ్డి కోరారు.  పెద్దపల్లిలోని ప్రెస్ క్లబ్ లో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో సన్నాహ సమావేశం ఈ సందర్భంగా నిర్వహించారు.  దీనికి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రఘు శంకర్ రెడ్డి  హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని, పర్యవేక్షణ అధికారుల, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని, పాఠ్యపుస్తకాలను, యూనిఫాంలు విద్యార్థులకు వెంటనే అందించాలని కోరారు.

317 జీవో వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మ్యూచువల్ బదిలీల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు కొమ్ము రమేష్, గోల్కొండ శ్రీధర్, మాడుగుల రాములు, ఎల్లయ్య,  గడ్డం అశోక్,  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు లక్ష్మణ్, శ్రీనివాస్, రామ్ కిషన్ రావు, సంతోష్ రెడ్డి, పరశురాములు, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.