ఈ కామర్స్ ఆన్లైన్ సంస్థల వల్ల రోడ్డున పడుతున్న డిస్ట్రిబ్యూటర్లు

  • పోటీకి తట్టుకోలేక ఆర్ధికంగా నష్ట పోతున్న వైనం
  • ముఖ్యఅతిథిగా తెలంగాణ వినియోగదారుల డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ శర్మ

భద్రాద్రి కొత్తగూడెం,(ఎఫ్ బి తెలుగు):కొత్తగూడెం పట్టణ బస్టాండ్ సమీపంలోని కొత్తగూడెం క్లబ్ నందు తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కూర శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ శర్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎఫ్.ఎం.సిజి డిస్ట్రిబ్యూటర్స్
మరియు తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్స్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ పధాదికారులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కూర శ్రీధర్,తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ శర్మ మాట్లాడుతూ ఈ కామర్స్ ఆన్లైన్ సంస్థల వల్ల వేలాది మంది డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల రాక డిస్ట్రిబ్యూటర్లుగా ఉంటూ కుటుంబాలను పోషించే కునే వారికి శాపంగా మారిందగన్నారు.

ఆన్ లైన్ లో నాసిరకం వస్తువు కొని వినియోగదారులు నష్టపోతున్నారని, అదేవస్తువు షాపులలో కొంటె వినియోగదారులు వాటి విలువ, తయారీ సమయం, వాటి నాణ్యత, నకిలీ వంటి వాటిని తెలుసుకునే వీలుండేదని, ఒక్కసారి ఆన్ లైన్ లో కొంటె తిరిగి వెనక్కు పంపే అవకాశం అక్కడ ఉండదని తెలిపారు. ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిమ్ కార్ట్ లాంటి ఆన్ లైన్ సంస్థల పోటీకి తట్టుకోలేక ఆర్ధికంగా నష్ట పోతున్న వేలాది మంది డిస్ట్రిబ్యూటర్లు కుటుంబాలతో సహా రోడ్డున పడుతున్నారన్నారు. కార్పోరేట్ సంస్థలకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ మరియు తెలంగాణ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, ఇతర కార్పోరేట్ బాధిత వ్యాపార సంఘాలు అన్నీ ప్రభుత్వానికి ఒక మెమొరాండం ఇవ్వాలని , కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా కొత్తగూడెం వేదికగా ఉద్యమాలకు డిస్ట్రిబ్యూటర్లు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు టి సి పి డి ఎ అధ్యక్షులు రాజేష్ శర్మ, కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ సుల్తాన్, కోశాధికారి అనిల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కూర శ్రీధర్,నీలి సంతోష్, దేవరకొండ శ్రీనివాస్, అర్థం శ్రీనివాస్, చింతా రవి, శ్రీ రవిచంద్ర, సందీప్ శర్మ, ఆనంద్, భువనగిరి కార్యవర్గము, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్, వందనపు రాము, ప్రధాన కార్యదర్శి వందనపు శ్రీధర్,కోశాధికారి కొయ్యడ నగేష్, కొత్తగూడెం డిస్ట్రిబ్యూటర్స్ సభ్యులు, ఖమ్మం, వైరా, తల్లాడ, ఏన్కూర్, పాల్వంచ, ఇల్లందు, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, వెంకటాపురం, చెర్ల, దమ్మపేట, ములకలపల్లి,
అశ్వరావుపేట, మధిర, వైరా, నేలకొండపల్లి, ఎఫ్.ఎం.సిజి కంపెనీల డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.