హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.

శంషాబాద్: ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆదివారం హైదరాబాద్ కు చేరుకున్నారు.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలువురు బిజెపి నాయకులు డాక్టర్ కే లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికారు.లక్ష్మణ్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.అనంతరం డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రశ్నించే గొంతుక గా తను పార్లమెంట్ కు పంపించడం సంతోషకరమని తెలంగాణ ప్రజల తరఫున పార్లమెంట్ లో తెలంగాణ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల గొంతుగా ప్రజల తరఫున పార్లమెంట్ లో మాట్లాడుతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక, ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు కూడా కెసిఆర్ పాలన చూసి తీవ్రంగా విసిగిపోయారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిజెపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో భారతీయ జనతా పార్టీ పెరిగిన ప్రజాదరణను చూసి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతిభ్రమించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి లో ఉన్న కేసీఆర్ తన స్థాయికి మించి ముఖ్యమంత్రి స్థాయికి తగ్గించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ వరదల నుండి ప్రజలను కాపాడేది వదిలేసి పదవులకోసం మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో ప్రజలు తీవ్ర స్థానంలో ఉన్నారని అతి త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఓవైసీ కుటుంబ పాలన కూడా ప్రజలు వదిలించుకుంటారనీ అన్నారు.

తెలంగాణ కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 1200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం చనిపోలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వేసుకొనే దుస్తులకు కించపరిచే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం సరైన పద్ధతి కాదని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా కుటుంబ పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ చేయడం లేదని,ఈ ఇద్దరూ ప్రజల కోసమే జీవిస్తున్నారని తెలిపారు. అవినీతి అధికారుల పాలనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విఱ్ఱవీగుతున్నారనీ, మరొక సంవత్సరం లో తెలంగాణ ప్రజలు ఎలాగైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కి బుద్ధి చెబుతారని, కనీసం ఒక సంవత్సరం అయిన నీతీగా నడుచుకోవాలని హితవు పలికారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి ప్రధానమంత్రికి ఏం పట్టలేదని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.