తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా విరహత్ అలీ ?

  • 2006 లోనే 16 ప్రజాసంఘాలతో గజ్వేల్ లో సమావేశం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు
  • కేసీఆర్, హరీష్ లతో మంచి సాన్నిహిత్యం 
  • రాష్ట్రంలో మెజారిటీ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీయూడబ్ల్యూజే-ఐజేయు ప్రధాన కార్యదర్శి 
  • జర్నలిస్టుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించడంలో దిట్ట

రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, సంస్థల్లో ఖాళీగా ఉన్న, పదవీకాలం ముగుస్తున్న చైర్మన్ ల భర్తీ ప్రక్రియను సీఎం కేసీఆర్ వేగవంతం చేసిన విషయం విదితమే. చైర్మన్ల నియమాకంలో ఆశావహులకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి సీఎం కేసీఆర్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ మీడియా అకాడమీ తొలి చైర్మన్ గా సుదీర్ఘ సేవలు అందించిన అల్లం నారాయణ పదవీ కాలం ముగుస్తుండటంతో జర్నలిస్టుల అందరి దృష్టి దీనిపైన పడింది. విశ్వసనీయత వర్గాల సమాచారం మేరకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ పెరు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన విరహత్ అలీ 1988లో జర్నలిస్టుగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు.

జర్నలిస్టుల సమస్యలతో పాటు ప్రజా సమస్యల మీద గళమెత్తి వాటి పరిష్కారానికి కృషి చేయడంలో విరహత్ అలీ ముందుంటారు. మలిదశ తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో 2006లోనే 16 ప్రజా సంఘాలతో గజ్వేల్ లో సమావేశం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు విరహత్ అలీ. అప్పట్లోనే ఈ సమావేశానికి దాదాపు పదిహేను వేలమంది హాజరయ్యారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం ముందుడే విరహత్ అలీ మెజారిటీ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీయూడబ్ల్యూజే-ఐజేయు ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అన్ని జర్నలిస్టు సంఘాలతో సత్సంబంధాలు కలిగియున్న విరహత్ అలీ ‘తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్’ గా నియామకమైతే తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పాటు సానుకూలంగా పరిష్కారం అవుతాయని జర్నలిస్టులు భావిస్తున్నారు. జర్నలిస్టులు,జర్నలిస్ట్ సంఘాలు ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.