మన కేసీఆర్ కు ఎన్ని కష్టాలు వచ్చాయ్: షర్మిల

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై విపక్ష నేతలందరూ ఛలోక్తులు విసురుతున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో భారీ వరదల వెనుక విదేశీ కుట్ర ఉందని… వాళ్లు కావాలనే దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ‘ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్, ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్, తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్, జాతీయ పార్టీల గిమ్మిక్కులు అయిపోయినయ్, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది, ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్.ఒక్క వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్ మన కేసీఆర్ దొర గారికి’ అని ఆమె ఎద్దేవా చేశారు.
YS Sharmila, YSRTP, KCR TRS, Cloud Bursting

Leave A Reply

Your email address will not be published.