వైఎస్సార్ కు జగన్, విజయమ్మ, షర్మిల నివాళులు.. వీడియో ఇదిగో!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్, భారతి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, షర్మిల కూతురు, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. సమాధి వద్ద మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. మరోవైపు వైఎస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘన నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

1949 జులై 8న కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన వైఎస్… ఒక్క రూపాయికే వైద్యం చేసి, రూపాయి డాక్టర్ గా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఓటమి ఎరుగని నేతగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. తన పూర్తి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వైఎస్… ఆ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలను చేపట్టారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.