ఆచ్చెన్నాయుడుకు అవమానం
భీమవరం అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. టీడీపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హజరయ్యారు. ప్రధానికి ఆహ్వానం పలికేందుకు హెలిప్యాడ్‌కు రావాలని కిషన్‌రెడ్డి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అయితే, అచ్చెన్నాయుడి పేరు లిస్టులో లేదని కలెక్టర్ వెల్లడించారు.
ఎస్పీజీ ఇచ్చిన లిస్టులో కూడా అచ్చెన్నాయుడి పేరు వుంది. కేంద్రమంత్రి చెప్పినా జిల్లా అధికారులు పట్టించుకోలేదని అచ్చెన్న అసహనం వ్యక్తం చేసారు. కలెక్టర్ జాబితాలో పేరు లేదని చెప్పడంతో అచ్చెన్నాయుడు ఆగిపోయారు. ఆహ్వానించి అవమానించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.