బిజెపి సిన్సియర్లు…. సీనియర్లకు షాక్‌

  • పార్టమెంటరీ బోర్డునుంచి గడ్కరీ, శివరాజ్‌ ఔట్‌
  • ‌కొత్తగా యెడ్యూరప్ప, సద్బానంద్‌ ‌సోనోవాల్‌కు చోటు
  • తెలంగాణ నుంచి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌కు అవకాశం

బిజెపిలో సీనియర్లకు మెల్లగా ఉద్వాసన సాగుతోంది. ఇప్టపికే అద్వానీ సహా అందరినీ సాగనంపగా మిలిని ఒకరిద్దరిని కూడా పంపేప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చోటుచేసు కున్నాయి. ఆ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరి, మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌లకు పార్లమెంటరీ బోర్డులో ఈసారి చోటు దక్కలేదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ ‌యడియూరప్పకు కొత్తగా చోటు కల్పించగా, పలువురు కొత్త ముఖాలను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. సంస్థాత మార్పుల్లో భాగంగా పార్లమెంటరీ బోర్డులో కీలకమార్పులను బీజేపీ చేపట్టింది.

బిజేపీలో అత్యంత కీలకంగా భావించే పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరిని మినహాయించడం దిగ్భ్రాతి కలిగించే అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని సీనియర్‌ ‌మంత్రుల్లో గడ్కరి ఒకరు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు కూడా. మాజీ అధ్యక్షులను పార్లమెంటరీ బోర్డులో కొనసాగించడం బీజేపీలో ఇంతవరకూ సంప్రదాయంగా కొనసాగుతోంది. కాగా, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు పార్లమెంటరీ బోర్డులో తిరిగి చోటు దక్కింది. మరో ఆశ్చర్యం కలిగించే అంశం కూడా ఈసారి చోటు చేసుకుంది. గత ఏడాది బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన 77 ఏళ్ల కర్ణాటక బీజేపీ నేత బీఎస్‌ ‌యడియూరప్పకు పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. ఇటీవల హిమంత్‌ ‌బిశ్వా శర్మకు మార్గం సుగమం చేసిన అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్‌ ‌సోనోవాల్‌కు పార్లమెంటరీ బోర్డులోనూ, సెంట్రల్‌ ఎలక్షన్‌ ‌కమిటీలోనూ చోటు దక్కింది. అలాగే, శివసేన రెబల్‌ ఏక్‌నాథ్‌ ‌షిండేతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను తాను తగ్గించుకునేందుకు ఇష్టపడి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఎలక్షన్‌ ‌కమిటీలో బీజేపీ అధిష్ఠానం చోటు కల్పించింది.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాతో పాటు మరో తొమ్మిది సభ్యులతో ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాశ్‌ ‌నడ్డా బోర్డును ప్రకటించారు. నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, అమిత్‌షా, జేపీనడ్డా, బీఎస్‌ ‌యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్‌, ‌కే లక్ష్మణ్‌, ఇక్బాల్‌ ‌సింగ్‌ ‌లాల్పురా, సుధా యాదవ్‌, ‌సత్యనారాయణ జాఠియా, బీఎల్‌ ‌సంతోష్‌ను సభ్యులుగా నియమించింది. ఇదిలా ఉండగా.. పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ, మధ్యప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌కు ఉద్వాసన పలుకగా.. బీఎస్‌ ‌యడ్యూరప్ప, బీఎల్‌ ‌సంతోష్‌లకు బీజేపీ పార్లమెంట్‌ ‌బోర్డులో అవకాశం కల్పించింది. అలాగే బీజేపీ 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు జేడీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి లక్ష్మణ్‌కు చోటు దక్కడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.