భారంగా బంగారం, వెండి

ముంబై, జూలై 2: మహిళలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పసిడి మరింత పరుగులు పెట్టనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి పన్ను 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. దీంతో బంగారం ధరలు మరింతగా పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తాజాగా శనివారం కూడా భారీగా పెరిగింది. అంతేకాకుండా వెండి ధర కూడా పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1200 పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1310 వరకు పెరిగింది. దేశీయంగా ఉదయం 6 గంటలకు నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.
☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.
☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,200 వద్ద ఉంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,250 వద్ద ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 వద్ద ఉంది.
☛ కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 ఉంది.

వెండి ధరలు:
చెన్నైలో కిలో వెండి ధర రూ.65,000, ముంబైలో రూ.59,000, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.59,000, కోల్‌కతాలో రూ.59,000, బెంగళూరులో రూ.65,000, హైదరాబాద్‌లో రూ.65,000, కేరళలో రూ.65,000, విజయవాడలో రూ.65,000 వద్ద ఉంది.

Leave A Reply

Your email address will not be published.