బిజెపి తెరాస రైతులకి చేసింది ఏమీ లేదు: డాక్టర్ మేడిపల్లి సత్యం

రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామంలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడిపల్లి సత్యం హాజరై మాట్లాడుతూ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా రైతులు రాజులు అవ్వాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒకేసారి రైతులకి రెండు లక్షల రుణమాఫీ క్వింటాలకి 2500 ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలతో పాటు ప్రతి పంటకి కనీసం మద్దతు ధర అమలు చేస్తామని తెలంగాణ రైతుల ఆకాంక్షను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. బిజెపి తెరాస రెండు కూడా రాష్ట్ర ప్రజలని నిండా మంచేశాయని రాబోయే రోజుల్లో ప్రజలు ఈ రెండు పార్టీలని తరిమి కొట్టడం ఖాయమని పేర్కొన్నారు.

కుటుంబం మాత్రమే తెలంగాణ రాజ్యానికి రాజులై పాలిస్తున్నారని డాక్టర్ మేడిపల్లి సత్యం ఎడ్డేవా చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ మేడిపల్లి సత్యం, జిల్లా బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, దేశరాజు పల్లె సర్పంచ్ కోల రమేష్, వన్నారం ఎంపీటీసీ జవాజి హరీష్, పంజాల శ్రీనివాస్ గౌడ్, కాడే శంకర్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శులు కడారి రాయుడు, ఎల్లమ్మల కృష్ణ, కడారి రాజేష్, కట్ల శంకర్, తడగొండ మల్లేశం, తడగొండ లక్ష్మణ్, బాపు రాజ్, పిండి సత్యనారాయణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.