ఆలియా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అది చాలా తక్కువ అని ఫీల్ అయిన ఆలియా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకొని త్వరలోనే తల్లి కాబోతుంది. చాలా తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ ఆలియా భట్. ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్ కూతురిగా 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ స్టార్ కిడ్. 19 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మొదటి పారితోషికం గురించి తెలిపింది.

అలియా భట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”నేను 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను. నా ఫస్ట్ సినిమాకి నేను 15 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నాను. నాకు ఇచ్చిన చెక్ ని డైరెక్ట్ మా అమ్మకు ఇచ్చాను. నేను అది చాలా తక్కువ అని ఫీల్ అయ్యాను. ఆ తర్వాత డబ్బులు నేను తీసుకొని నా మొదటి సంపాదనతో కారు కొనుక్కున్నాను. ఇక 22 ఏళ్ళు వచ్చేసరికి వరుస సినిమాలు చేస్తుండటంతో డబ్బులు బాగానే వచ్చాయి. దీంతో సొంత ఇంటిని కొనుక్కున్నాను. ఇప్పటికీ నా ఆర్థిక లావాదేవీలన్ని మా అమ్మే చూసుకుంటుంది. నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత మనీ ఉన్నాయో నాకు తెలీదు కానీ బాగానే డబులు ఉన్నట్టు మాత్రం తెలుసు. నాకు సంబంధించిన లావాదేవీలు నన్నే చూసుకోమని అందరూ సూచిస్తారు. కొద్దిరోజుల్లో నాకు పిల్లలు పుట్టబోతున్నారు. ఇప్పుడైన నా ఆర్థిక లావాదేవీలు నేను చూసుకోవడం నేర్చుకోవాలి” అని తెలిపింది.

అయితే ఆలియా మొదటి సినిమాకి 15 లక్షల రెమ్యునరేషన్ తీసుకొని అది చాలా తక్కువని చెప్పడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నువ్వు స్టార్ కిడ్ కాబట్టి నీకు అంత ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి, వేరే పరిశ్రమలలో కొత్త వాళ్ళకి అసలు అంత రెమ్యునరేషన్ ఇవ్వరు అది కూడా 2012లో అంత రెమ్యునరేషన్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Leave A Reply

Your email address will not be published.