కవలలకు జన్మనిచ్చిన నమిత.. వీడియో విడుదల చేసిన నటి

హీరోయిన్‌ నమిత గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకుంది. ఆమె కవలలకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ‘నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.హాస్పిటల్‌ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్‌ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. కాగా వెంకటేశ్‌ హీరోగా నటించిన జెమిని సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నమిత అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్‌ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.