కోబ్రా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

తమిళ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ సినిమా వస్తుందంటే, కేవలం తమిళనాటే కాకుండా తెలుగునాట కూడా ఆయన సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. ఇక ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విక్రమ్ ఏడు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

ఈ సినిమాలో విక్రమ్ రికార్డు స్థాయి గెటప్స్‌లో కనిపిస్తారని చిత్ర యూనిట్ చెబుతోంది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఆగస్టు 25న కోబ్రా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో చియాన్ విక్రమ్ అభిమానులు ఈ సినిమా ట్రైలర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో కేజీయఫ్ మూవీ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తమిళంలో ఎంట్రీ ఇస్తోంది. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.