చార్మీ – పూరీ మధ్య బంధాన్ని ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా..?

ఇండస్ట్రీలోకి నటీ నటులు ఎంట్రీ ఇచ్చేటప్పుడు .. తమ క్రేజ్ పరంగా బాగా ఉండి స్టార్ పొజిషన్లో చేరుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇక తమకు సినిమాలు చాలు అనుకున్నప్పుడు మాత్రమే ఆగిపోతారు..

అంతవరకు అతి విశ్రాంతిగా శ్రమిస్తూనే ఉంటారు. అయితే కెరియర్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటారు నటీనటులు. అలాంటి అద్భుతంతోనే నటి ఛార్మీ నీ తాజాగా మళ్లీ వెలుగులోకి రావడం జరిగింది దాదాపుగా పదేళ్ల సినిమా కెరియర్ లో ఛార్మి ఒక జీవితానికి సరిపడా అనుభవాలను అనుభవించిందట. చార్మి కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.2001 మే 27న సినిమా అంటే ఏంటో తెలియని పసితనంలో తను షూటింగ్లో పాల్గొన్నానని ఛార్మి తెలియజేసింది.. జూనియర్ ఆర్టిస్ట్ గా ముజేసే దోస్తీ కరోగి అనే చిత్రంలో నటించిన కొన్ని నెలల తర్వాత తెలుగులో అవకాశాన్ని దక్కించుకున్నది. ఇక మార్చి 28న 2002లో హీరోయిన్గా మొదటిసారి నీ తోడు కావాలి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నటించే సమయానికి ఈమె వయసు 15 ఏళ్లు మాత్రమే. ఇక సినిమాలో ఛార్మి చెప్పిన డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. కానీ ఆ సినిమా ప్లాపును మూటగట్టుకుంది కేవలం తెలుగులోనే కాదు ఆమె తమిళంలో కూడా కాదల్ అలివదిల్లయ్ అనే సినిమాలో మలయాళం లో కట్ట చెంబాకమ్ అనే సినిమాలలో నటించింది.

ఈ సినిమాలో కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇవన్నీ 2002లోనే విడుదలయ్యాయి.అయితే 15 ఏళ్ల వయసులో ఎవరైనా అమ్మాయిలు తన సినిమాలు ఆడడం లేదని బాధతో సినిమాలు మానేస్తూ ఉంటారు. కానీ ఛార్మి ఇందుకు భిన్నంగా అన్నిటిని తట్టుకొని నిలబడి సినిమాలను ఒక ఫ్యాషన్ గా భావించి గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంతో సినిమాలు చేసింది. అలా ప్రారంభించిన మూడేళ్లకు మాస్ సినిమాతో మళ్ళీ సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగింది. అయితే ఆమెకు ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. 2012లో ఆ తర్వాత హీరోయిన్ గా ఛార్మి కెరియర్ ముగిసిపోయింది. దీంతో గెస్ట్ పాత్రలలో నటించింది.అయితే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ఆమె జీవితాన్ని మలుపు తిప్పారు. . పూరి తో సహా నిర్మాత గా మారి అతి తక్కువ సమయంలోనే మంచి ఘనత సాధించింది. సినిమా నిర్మాణం అంటే చిన్న విషయం కాదు చాలా కష్టంతో కూడుకున్న పని.. ఇండస్ట్రీలో ఎన్నో మోసాలు రాజకీయాలను తట్టుకొని నిలవడం చాలా కష్టం.. అది తెలిసి కూడా చాలా ధైర్యంతో ఛార్మి ముందడుగు వేసింది. జ్యోతిలక్ష్మి సినిమాలో మెయిన్ రోల్ లో నటించడమే కాకుండా సినిమాను కూడా నిర్మించింది. చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక తర్వాత 2017లో నటనకు స్వస్తి చెప్పి.. నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం ఒక పాన్ ఇండియాగా ప్రొడ్యూసర్ గా మారింది. ప్రస్తుతం లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు పొందింది. ఇక వ్యక్తిగత విషయంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడింది. అయితే వీరిద్దరి మధ్య కేవలం స్నేహబంధమే ఉందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.