చైతూ దెబ్బకు సైలెంట్ అయిన సమంత.. అసలు ఏమైందంటే..?

నాగచైతన్య – సమంత.. విడాకుల తర్వాత వీరిద్దరూ ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉండగా.. సమంత మాత్రం ఒక వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు నాగచైతన్యను టార్గెట్ చేస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

అంతేకాదు సమంత చేసిన వ్యాఖ్యలకు నాగచైతన్య అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు ఆమెను విపరీతంగా ట్రోల్ కి కూడా గురి చేశారు. ఇకపోతే మొన్నటి వరకు విపరీతంగా విజృంభించిన ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిందనే చెప్పాలి. ఇక అసలు విషయం ఏమిటంటే బాలీవుడ్ కెరియర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా హిందీ ప్రాజెక్ట్లను తన ఖాతాలో వేసుకుంటూ సైలెంట్ గా పని చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

మొన్నటి వరకు తెలుగులో అవకాశాలు రావాలని ఎంతో ఆతృతగా చూసిన సమంత.. ప్రస్తుతం తెలుగు ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ.. బాలీవుడ్లో బిజీ అవుతోంది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన ఈమె ఉత్తర సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇక ఈ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకొని ప్రస్తుతం పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించడం లేదు.. సెలబ్రిటీలకు సంబంధించిన పుట్టినరోజులు, వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతుంటే వాళ్లకి విషెస్ చెప్పడం మినహాయించి అన్ని విషయాలను ఈమె గోప్యంగానే ఉంచుతోంది. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈమె ఏం చేస్తోంది అనీ వార్తలు కూడా వైరలవుతున్నాయి.

ఇకపోతే ఫ్యామిలీ మ్యాన్ -2 లో చెలరేగిపోయిన ఈమె ఇదే సీరిస్ లో మరింత హాట్ పెర్ఫార్మెన్స్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ఇందులో భాగంగానే వర్క్ షాప్స్ పూర్తి చేసే పనిలో ఉంది సమంత. ఇకపోతే హిందీ లాంగ్వేజ్ పై పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉండగా భాష కోసం పలు హిందీ క్లాసులకు కూడా రెగ్యులర్గా హాజరవుతోందట. ఇక అలాగే గచ్చిబౌలిలో నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని సమంత మళ్ళీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇంటిని రెనోవేట్ చేయాల్సి ఉంది. ఇక ఆ ఇంట్లో చైతన్యతో ఉన్న జ్ఞాపకాలు అన్నిటిని చెరిపివేసి పూర్తిగా తనకు నచ్చిన విధంగా సిద్ధం చేయించుకోవాలని చూస్తోంది సమంత. కానీ ఈమె మాత్రం ఏ విషయాన్ని చెప్పకపోయేసరికి నాగచైతన్య దెబ్బకు సమంత కామ్ అయిపోయిందనే వార్తలను కూడా చైతూ అభిమానులు స్ప్రెడ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.