జిన్నా టీజర్ రెడీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’ ఈ సినిమా టీజర్ ను ఆగస్ట్ 25న విడుదల చేస్తారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.

బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో విష్ణు మంచు సరసన సన్నీలియోన్ తో పాటు మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

మంచు విష్ణు కెరీర్ లో పలు భాషల్లో ఏక కాలంలో విడుదలవుతున్న సినిమా ఇదే. గతంలో ఓ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి ప్రయత్నించి, కరోనా కారణంగా విరమించుకున్నాడు విష్ణు. ఇప్పుడు జిన్నా మూవీని మాత్రం ఒకేసారి తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నేరుగా విడుదల చేయాలని నిర్ణయించాడు.

Leave A Reply

Your email address will not be published.