జీవితంలో గెలవాలంటే ఏం చేయాలి, తన బ్యూటీ సీక్రెట్‌ ఏంటో చెప్పిన నేహా..

ఆకాశ్‌ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి నేహా శెట్టి. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

అనంతరం గల్లీ రైడీ, మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమాల్లో నటించి మెప్పించిన నేహా.. 2022లో వచ్చి డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. రాధిక పాత్రలో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేసింది. తనదైన క్యూట్ యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందీ బ్యూటీ.

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో నేహా శెట్టి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నేహాశెట్టి.. తన బ్యూటీ సీక్రెట్‌ ఎంటో చెప్పేసింది. తన స్లిమ్‌, గ్లామర్‌ సీక్రెట్‌ ప్రత్యేకంగా ఎలాంటి పనులు చేయనని కేవలం ఇంటి ఫుడ్‌ మాత్రమే తింటానని చెప్పింది. తన బ్యూటీ సీక్రెట్‌కు అదే కారణమని చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలు, పనులతో వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నారన్న ప్రశ్నకు మెడిటేషన్‌ సొల్యుషన్‌ సమాధానం అని చెప్పుకొచ్చింది. జీవితంలో విజయం సాధించాలంటే ఎలాంటి ఫార్ములాలు ఉండవని కష్టపడి చేస్తూ, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలని అప్పుడే విజయం సొంతమవుతుందని నేహా తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave A Reply

Your email address will not be published.