డిప్రెషన్​​లో నాగ చైతన్య?.. ఆ సినిమాతో బిగ్​ షాక్

టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున తర్వాత నట వారసుడిగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

సినీ ఇండస్ట్రీలో సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీ వంటి విషయాలకు దూరంగా ఉంటాడు. సినిమాలు, ప్రమోషన్లు, కెరీర్​ అంటూ తన పని తాను చూసుకుంటుపోయే కామ్​ పర్సన్. అయితే స్టార్​ హీరోయిన్​ సమంతతో నాగ చైతన్యకు విడాకులు అయినప్పటి నుంచి వారి వ్యక్తిగత విషయాలపై అందరూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. సినీ కెరీర్​ గురించి తప్పా పర్సనల్​ లైఫ్​ గురించి ఆసక్తి చూపే వాళ్లను కూడా పట్టించుకోడు. ఇటీవల లాల్​ సింగ్​ చడ్డా సినిమాతో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ప్రస్తుతం షాక్​లో ఉన్నట్లు సమాచారం.

టాలీవుడ్​ మన్మథుడు నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి.

తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య. ఇందులో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు.

అనంతరం క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో మిల్క్​ బ్యూటీ తమన్నాతో నాగ చైతన్య జోడి కట్టిన చిత్రం 100% లవ్. ఈ సినిమా కూడా బ్లాక్​ బస్టర్ హిట్​ అయింది. దీంతో చైతూ లవర్ బాయ్​గా ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ భారీ విజయాల తర్వాత వచ్చిన దడ, బెజవాడ, అటో నగర్​ సూర్య, తడఖా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.

అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం మనం. విక్రమ్​ కె కుమార్​ దర్శకత్వం వహించిన ఈ మూవీ టాలీవుడ్​ ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. ఇందులో సమంత నటించడం, నాగ చైతన్య, సామ్​ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండటమే కాకుండా అమల, అఖిల్​ అతిథి పాత్రల్లో మెరవడంతో పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ సినిమా అయింది.

Leave A Reply

Your email address will not be published.