డీజే టిల్లు కోసం ధమాకా లాంటి బ్యూటీ..?

డీజే టిల్లు.. ఈ సినిమా పేరు తెలుగు ఆడియెన్స్‌కు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ మూవీగా డీజే టిల్లు-2 కూడా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

డీజే టిల్లు.. ఈ సినిమా పేరు తెలుగు ఆడియెన్స్‌కు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒక చిన్న సినిమాగా వచ్చిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో నింపేయడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. దీంతో ఈ సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ మూవీగా డీజే టిల్లు-2 కూడా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీలా ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో డీజే టిల్లు మొదటి భాగంలో అందాల భామ నేహా శెట్టి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వగా, అమ్మడి అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈసారి హీరోయిన్‌ను మారిస్తే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్, శ్రీలీలాను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారట.

అమ్మడు అయితే సినిమాకు కొత్తదనాన్ని తీసుకొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఏదేమైనా డీజే టిల్లు లాంటి మాస్ పాత్ర సరసన హీరోయిన్‌గా నటించడం అంటే, అమ్మడికి యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంటుందని.. ఈ సినిమాతో శ్రీలీలా ప్రేక్షకులకు మరింత దగ్గర కావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మల్లిక్ రామ్

Leave A Reply

Your email address will not be published.