త్రిష జాతకంలో ప్రేమ, పెళ్లి యోగం లేనట్టేనా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన త్రిషకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య కాలంలో త్రిషకు తెలుగులో ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.

అయితే త్రిషకు వ్యక్తిగత జీవితంలో మరో ఎదురుదెబ్బ తగిలిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వల్ల ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

తెలుగులో వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకున్న త్రిష అటు సీనియర్ హీరోలకు, ఇటు యంగ్ జనరేషన్ హీరోలకు జోడీగా నటించి మెప్పించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలకు త్రిష జోడీగా నటించారు. ఒకవైపు తెలుగులో వరుస ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు తమిళంలో కూడా ఆఫర్లను సొంతం చేసుకుని త్రిష సత్తా చాటారు. తాజాగా త్రిష తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు.

ఆ పోస్ట్ లో త్రిష విషపూరితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు వాళ్లంతట వాళ్లే మాట్లాడటం మానేయడం సంతోషంగా ఉందని దీనిని చూస్తుంటే చెత్త దానంతట అదే తొలగిపోయినట్లుగా ఉందని త్రిష అన్నారు. ఇది చూసిన నెటిజన్లు త్రిష లవ్ లో ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. త్రిష ఎవరిని ఉద్దేశిస్తూ ఈ పోస్టులు పెట్టారో క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో త్రిష ఒక టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత నిర్మాత వరుణ్ తో త్రిష ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. అయితే పెళ్లి పీటలెక్కకముందే ఈ ప్రేమ పెటాకులైంది. త్రిష జాతకంలో ప్రేమ, పెళ్లి యోగం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల కామంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష రాజకీయాలపై దృష్టి పెట్టారని ప్రముఖ పార్టీలో ఆమె జాయిన్ కానున్నారని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.