పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘జల్సా’ రీ రిలీజ్ కి టైం ఫిక్స్..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక ట్రెండ్ నదిస్తుంది. అదేంటంటే…..కొన్నేళ్ల క్రితం విడుదలైన బ్లాక్‌ బాస్టర్‌, క్లాసిక్‌ సినిమాలను ఇప్పుడు కొత్తగా మరో సారి విడుదల చేస్తున్నారు.
లుక్ ఈ క్రమంలో తాజాగా 16 సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన పోకిరి సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు.ఇదిలావుంటే ఇక సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4కే రిజల్యూషన్‌తో విడుదల చేసిన ఈ సినిమా మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.ఇకపోతే పదహారేళ్ల క్రితం కొత్తగా విడుదలైనప్పుడు ఎలా కలెక్షన్లు వసూలు చేసిందో.. ప్రస్తుతం కూడా అలానే భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే ఆగస్టు 9న రీ రిలీజ్ అయిన పోకిరి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

కాగా ఏకంగా రూ.1.73 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.పోతే పోకిరి ఇచ్చిన రీ రిలీజ్‌ జోష్‌తో మరో సినిమా విడుదల చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మహేష్‌ పోకిరి సినిమా బాటలో పవన్‌ కళ్యాణ్‌ జల్సా సినిమాను కూడా రీ రిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడంతో అదే రోజున జల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక పాటలు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ 14 సంవత్సరాలు పూర్తి కావోస్తుంది.

పోతే ఈ క్రమంలో మరోసారి 4కే రిజల్యూషన్‌తో సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.అయితే ఇప్పటికే కొత్త ప్రింట్ పూర్తయినట్టు తెలుస్తోంది.ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేశ్ కొత్త ప్రింట్‌ను చూసినట్టు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక పోతే కొత్త ప్రింట్‌లో పవన్‌ కళ్యాణ్‌ కొత్తగా కొన్న అద్దంలా మిలమిలా మెరిసిపోతున్నాడని.. సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉందని.. మీ సెలబ్రేషన్స్ మొదలుపెట్టండి అని ట్వీట్ చేశాడు.ఇక ఇది చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.