ప్రియా ప్రకాష్ వారియర్ కు దారుణమైన అనుభవాలు.. అంతా ఆ క్రేజ్ వల్లే

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒరు ఆడార్ లవ్ ఈ సినిమా ప్రచార సమయంలో విడుదల చేసిన వీడియోలో ప్రియా ప్రకాష్ కన్ను కొట్టే సీన్ దేశవ్యాప్తంగా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఆ ఒక్క సీన్ తో ప్రియా ప్రకాష్ కు దేశ వ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్స్ ని ఏర్పరచుకుంది. దీంతో అప్పటి నుంచి ఈ ప్రియా ప్రకాష్ వారియర్ ను అభిమానులు ముద్దుగా కన్ను గీటు భామ లేదా ముద్దుగా పింక్ బ్యూటీ అని కూడా పిలుచుకుంటుంటారు. సోషల్ మీడియా సెన్సేషన్ అయినా ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్నెట్ ను ఏ విధంగా షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే.

ఒరు అడార్ లవ్ సినిమా నుంచి విడుదలైన ఒక్క వీడియోతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఈ వీడియోనే కనిపించింది. సినిమాలోని ఆ సన్నివేశం అన్ని వర్గాల ప్రేక్షకులనుఆకట్టుకుంది. దీంతో వాట్సాప్ ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో బాగా వైరల్ అయింది. అయితే ఆ సినిమాను కేవలం మలయాళం లోని విడుదల చేయాలి అని అనుకున్నారు. కానీ ఆ ఒక్క సీన్ తో దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో అన్ని భాషల్లోకి రిలీజ్ చేసే అంతవరకు వెళ్ళింది ఈ సినిమా.

 

ఇది ఇలా ఉంటే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా కన్ను గీతాడం వలన తను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు గురించి కూడా తెలియజేసింది. ఆ సమయంలో తన వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే అని ఒక్క సన్నివేశంతోనే అంతగా పాపులర్ కావడంతో చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాలేదు అని తెలిపింది. అయితే నేను కన్ను గిట్టిన విధానం నాకు ఒక విధంగా మంచి క్రేజ్ తీసుకొచ్చేటప్పటికి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ అలాగే మీమ్స్ కూడా నన్ను బాధ పెట్టాయి అందులో చాలా నెగిటివ్ ఉండడంతో ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే ఆ సినిమాలో కన్ను గీటడం కూడా వలన కొన్ని పోలీస్ కేసులు నమోదయ్యాయి అని చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆమె అలా చేయడం ఓవర్గం మతం వారిని అవమానపరిచే విధంగా ఉంది అని కామెంట్ చేశారట. అప్పుడు ఆ పోలీస్ కేసులను కూడా ఇలా ఎదుర్కోవాలో నాకు అర్థం అయ్యేది కాదు అని చెప్పుకొచ్చింది ప్రియా వారియర్ ప్రకాష్.

Leave A Reply

Your email address will not be published.