ఫ్లైట్‌లోనే నయనతార – విఘ్నేష్ రచ్చ

సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే పెళ్లి వరకూ చేరుకుని సుఖాంతం అవుతాయి. అలా చాలా తక్కువ జంటలే తమ బంధాన్ని మూడు ముళ్ల వరకూ తీసుకెళ్లగలిగారు. అందులో సుదీర్ఘ కాలం పాటు ప్రేమ పక్షుల్లా విహరించి, ఇటీవలే ఒక్కటైన లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి.

 

ఇటీవలే అగ్నిసాక్షిగా ఒక్కటైన వీళ్లిద్దరూ.. ఎంతో గ్యాప్ తీసుకోకుండా తమ తమ కెరీర్‌లను పున: ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ – విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనమయ్యారు

హీరోయిన్‌గా నయనతార ఎంతో విజయవంతం అయింది. అందుకే ఆమెకే లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా దక్కింది. అయితే, ఈ అమ్మడు లవ్ ట్రాకుల విషయంలో పలుమార్లు విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో నయన్.. విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలెట్టింది. నాలుగేళ్ల పాటు అతడితో బంధాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.

 

పెళ్లి చేసుకున్న తర్వాత నయనతార – విఘ్నేష్ శివన్ జోడీ ఇండియాలోని పలు దేవాలయాలను సందర్శించింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవాలయంలో చెప్పులతో వెళ్లిందని పెద్ద వివాదమే చెలరేగింది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్‌కు చెక్కేసింది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీళ్లిద్దరూ తమ కొత్త జీవితాన్ని తెగ ఎంజాయ్ చేసి చాలా రోజులకు తిరిగి వచ్చారు.

పెళ్లైన తర్వాత నయనతార సినిమాలకు సుదీర్ఘ కాలం బ్రేక్ ఇస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఆమె వివాహం జరిగిన నెల వ్యవధిలోనే తన కెరీర్‌ను పున: ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లలో పాల్గొంది. అలాగే, విఘ్నేష్ శివన్ కూడా తన తదుపరి సినిమా ప్రొడక్షన్ వర్క్‌లను దగ్గరుండి పర్యవేక్షించాడు.

వివాహం జరిగిన చాలా తక్కువ సమయంలోనే సినిమా పనుల్లో బిజీ అయిన నయనతార – విఘ్నేష్ శివన్.. ఖాళీ సమయాల్లో తమ వైవాహిక జీవితాన్ని చక్కగా గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పర్వదినాలను కుటుంబ సమేతంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార.. విఘ్నేష్ శివన్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు పయనం అయ్యారు.

సోషల్ మీడియా ద్వారా ప్రకటన జంటగా గడుపుతోన్న మధుర క్షణాలను అటు నయనతార కానీ, ఇటు విఘ్నేష్ శివన్ కానీ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు వీళ్లిద్దరూ బార్సిలోనాకు పయనమైన విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. తాజాగా విక్కీ ‘వర్క్ వర్క్ వర్క్ కాకుండా మాకోసం కొంత సమయం’ అంటూ చెప్పుకొచ్చాడు.

రొమాంటిక్ పిక్స్ వదిలిన విఘ్నేష్విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో కలిసి ప్లైట్‌లో బార్సీలోనా వెళ్తోన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇందులో నయన్ అతడి మీద కూర్చుని ఉంది. మరో పిక్‌లో విఘ్నేష్ ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఈ ఫొటోలకు భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అయిపోతోన్నాయి

Leave A Reply

Your email address will not be published.