బాహుబలిలో అనుష్కలా కార్తీకదీపంలో వంటలక్క.. లెజెండ్ ఈజ్ బ్యాక్ అంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గురించి, ఆ సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా ఈ సీరియల్ ని ఇష్టపడే వారు ఎంతో మంది ఉన్నారు.కార్తీకదీపం సీరియల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు రెండు అందులో ఒకటి డాక్టర్ బాబు మరొకటి దీప అలియాస్ వంటలక్క.ఈ సీరియల్ లో వంటలక్క పాటలు నటించిన ప్రేమి విశ్వనాథ్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

ఇకపోతే కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రులు ముగిసిన విషయం తెలిసిందే.కొత్త జనరేషన్ ని మొదలు పెట్టి ప్రస్తుతం హిమ, సౌర్యల చుట్టూ కథ మొత్తం నడిపిస్తున్నారు.కాగా కార్తీకదీపం సీరియల్ లోకి మళ్ళీ వంటలక్క రీఎంట్రీ ఇవ్వాలి అని లక్షలాదిమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు కోరుకుంటున్నారు.

అయితే దీప,కార్తిక్ లో లేని ఈ సీరియల్ ను చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.అంతే కాకుండా ఈ సీరియల్ లో డాక్టర్ బాబు,వంటలక్క పాత్రలు ముగిసిన తర్వాత చాలామంది ఈ సీరియల్ ని చూడటమే మానేశారు.ఇది ఇలా ఉంటే కార్తీకదీపం సీరియల్ లోకి ఎలా అయినా మళ్ళీ వంటలక్క తీసుకురావాలి అని అభిమానులు కోరారు.ఇదిలా ఉంటే తాజాగా స్టార్ మలో విడుదలైన ప్రోమో అభిమానులు ఆసక్తిని రేకేతిస్తోంది.ఆ ప్రోమోలో దాదాపు 12 సంవత్సరాల పాటు కోమాలో ఉన్న వంటలక్క యాక్సిడెంట్ అయిన విషయాలు అన్నీ తలుచుకొని ఒక్కసారిగా డాక్టర్ బాబు అంటూ గట్టిగా అరుస్తుంది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోని చూసిన అభిమానులు వంటలక్క మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతోంది అని సంతోషపడుతున్నారు.ఒకవేళ అదే కనుక నిజమైతే కార్తీకదీపం టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోవడం ఖాయం.

Leave A Reply

Your email address will not be published.