బాహుబలి వల్లే నాకు అలాంటి పేరు వచ్చింది..thammana

తెలుగు సినీ ప్రేక్షకులకు మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా మొదట మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

తన అందం నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.కాగా సిని ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి దాదాపు 17 ఏళ్లు అవుతుంది.అయితే తమన్నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది.

ఇది ఇలా ఉంటే తమన్నా ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.అలాగే ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా, అలాగే సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాలలో నటిస్తోంది.ఇప్పటికే గుర్తుందా శీతాకాలం సినిమా సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.

అలాగే మరోవైపు బాలీవుడ్ లో ఈమె నటించిన బాబ్లీ బౌన్సర్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.కాగా ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ.ఇందులో తమన్నా లేడీ బౌన్సర్ గా అలరించబోతోంది.కాగా బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ చిత్రం డైరెక్టుగా ఓటీటీలో సెప్టెంబర్ 23న హిందీ తెలుగు తమిళ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ బాబ్లీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెలిగించింది.అలాగే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.బాహుబలి అన్ని వైపుల నుంచి తలుపులు తెరిచి తన కెరీర్ కు ఎంతగానో సహాయపడిందని, అదేవిధంగా పక్కింటి అమ్మాయిగా కాకుండా నటిగా తన సత్తా ఏంటో అందరూ గ్రహించేలా చేసింది కూడా ఈ సినిమానే అంటూ తమన్నా స్పష్టం చేసింది.దీంతో ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Leave A Reply

Your email address will not be published.