మెల్‌బోర్న్‌లో తమన్నా సింప్లిసిటీ..

మెల్‌బోర్న్‌లో తమన్నా సింప్లిసిటీ.. మెల్‌బోర్న్‌లో తమన్నా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా  సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు నటి తాప్సీ తో పాటు తమన్నా కూడా హాజరైంది. అయితే ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా తమన్నా చేసిన ఓ చిన్న పని నెట్టింట వైరల్ అవుతోంది. జ్యోతి ప్రజ్వలన చేసే సమయంలో తమన్నా చెప్పులు వదిలేసి వెలిగించింది. అంతకు ముందు దీపం వెలిగించిన తాప్సీ తన హీల్స్ తీయలేదు. తమన్నా మాత్రం తన హీల్స్ వదిలేసి.. జ్యోతి ప్రజ్వలన చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.సింప్లిసిటీ.. ఇక సినినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి  సరసన భోళా శంక‌ర్ మూవీలో మిల్క్ బ్యూటీ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.

 

సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిరంజీవికి ప్రియురాలుగా తమన్నా అందరినీ మెప్పించింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్‌తో కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌పై ఉంది.అదేవిధంగా మరో వార్త కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్హీరోగా జైలర్  మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారా లేదా.. ఏదైనా కీలక పాత్రకు ఎంపిక చేశారా.. అనేది తెలియాల్సి ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్  జైలర్ మూవీకి దర్శకత్వం వహిస్తు్న్నాడు. భోళా శంకర్, జైలర్ సినిమాలు హిట్ కొడితే.. తమన్నా కెరీర్‌ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.