రాజీవ్ క‌న‌కాల‌తోపెళ్లి పాపం మీదేనంటూ రాఘ‌వేంద్ర‌రావుపై సుమ కామెంట్స్‌.. అస‌లేం జ‌రిగింది!

టాలీవుడ్‌కి చెందిన స్టార్ యాంక‌ర్స్‌లో సుమ క‌న‌కాల ఒక‌రు. ఈమె యాక్ట‌ర్ రాజీవ్ క‌న‌కాల‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి అంద‌రికీ విదిత‌మే. తాజాగా సుమ రాజీవ్ క‌న‌కాల‌తో త‌న పెళ్లి చేసినందుకు డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావుపై సెటైర్స్ వేసింది. అస‌లేం జ‌రిగింది.. ఎందుకు సుమ, ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్రరావుని టార్గెట్ చేసింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీధ‌ర్ సీపాన డైరెక్ష‌న్‌లో వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాను రూపొందిందింది.

వాంటెడ్ పండుగాడ్ సినిమా ఆగ‌స్ట్ 19న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ జ‌ర‌గుతున్నాయి. అందులో భాగంగా సుమ యాంక‌రింగ్ చేస్తోన్న క్యాష్ అనే కామెడీ షోలో ఎంటైర్ టీమ్ పాల్గొంది. దానికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ఇందులో అన‌సూయ భ‌ర‌ద్వాజ్  చేయి ప‌ట్టుకుని రాఘ‌వేంద్ర‌రావు సెట్స్‌లోకి వ‌చ్చారు. తాను చ‌దువుకునే రోజుల్లో అన‌సూయ అనే అమ్మాయి ఉండేద‌ని అందుక‌నే ఇప్పుడు తాను అన‌సూయ చేయి ప‌ట్టుకుని ప్రోగ్రామ్‌లోకి వ‌చ్చాన‌ని ద‌ర్శ‌కేంద్రుడు అన్నారు. దానికి సుమ మాట్లాడుతూ మీ లైఫ్‌లో సుమ అనే అమ్మాయి లేదా సార్‌! అంటే సుమ లేని లైఫ్ ఉంటుందా? అని ద‌ర్శ‌కేంద్రుడు అన్నారు. అలాగే నా వ‌ల్లే క‌దా నీకు పెళ్లైంది అని కూడా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.