లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు వైరల్.. అక్కడ అలా కనిపించడంతో!

కొన్నాళ్ల క్రితం లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వివాహం కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగిన క్రమంలో లావణ్య త్రిపాఠి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది కూడా. తన పెళ్లి ఎవరితో అనేది ఇప్పటివరకు తనకే తెలియదని, ఇక వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటూ ఆమె అప్పట్లో కౌంటర్ వేసింది. మీరు ప్రేమతో ప్రేమలో ఉన్నారా అని అడిగితే ఆ విషయాన్ని పెద్దగా హైలెట్ చేయకుండా మాట మార్చేసింది ఆమె. అయితే ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ సినిమా సమయంలో ఇద్దరికీ పరిచయం
నిజానికి ఈ ఇద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమాలో మొదటి సారి నటించారు. ఆ తర్వాత అంతరిక్షం అనే సినిమాలో కూడా ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాల పరిచయం నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని త్వరలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా లావణ్య వరుణ్ తేజ్ ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొనడంతో వారి పెళ్లి వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్లో జరిగిన ఒక పార్టీలో వరుణ్ తేజ్ లావణ్య కనిపించరు. ఈ పార్టీలో వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, నితిన్ భార్య షాలిని కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్త మరోసారి వైరల్ అవుతుంది. అయితే మెగా అభిమానులు మాత్రం మెగా కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ వార్త నమ్మలేము అని అంటున్నారు.

అందుకే ఇంత బలమైన ప్రచారం
నిజానికి వీరిద్దరి పెళ్లి గురించి అంత బలమైన ప్రచారం జరగడానికి మరో ముఖ్య కారణం ఉంది. అది ఏమిటంటే వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక వివాహం గతంలో రాజస్థాన్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు కేవలం బంధువులు మాత్రమే హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరికి ఆహ్వానాలు అందలేదు. కరోనా కాలం కావడంతో అక్కడ పెళ్లి జరిపించి హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేసి ఇక్కడ సినీ ప్రముఖులను ఆహ్వానించారు.

అయితే లావణ్య త్రిపాఠి మాత్రం రాజస్థాన్లో పెళ్లికి కూడా హాజరు కావడంతో వరుణ్ తేజ్ కు ఆమెకు మధ్య నిజంగానే ఏదో ఉందనే ప్రచారం పెద్దగా ఊపందుకుంది. అయితే కెరీర్ పరంగా లావణ్య త్రిపాఠి చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉంది. ఆమె నటిస్తున్న ఏ సినిమా కూడా ఇప్పుడు హిట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చివరిగా అర్జున్ సురవరం అనే సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తర్వాత చేసిన ఏ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్డే సినిమాలు దారుణమైన డిజాస్టర్ ఫలితాలు ఇచ్చాయి.

నాగబాబు క్లారిటీ:
అయితే కొన్నాళ్ల క్రితం వరుణ్ తేజ్ వివాహం గురించి కూడా నాగబాబు క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అని అడిగితే ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతాడని నాగబాబు చెప్పుకొచ్చారు. అంతకుముందు ఒకసారి వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడిగితే మంచి సంబంధాలు ఉంటే చూడమని ఎదురు కౌంటర్ వేశారు నాగబాబు. దీంతో అసలు ఈ పెళ్లి వ్యవహారం ఎంతవరకు నిజమవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.