లైగర్ చిత్రం కోసం విజయ్ దేవరకొండ అలాంటి త్యాగం చేశారా..!!

టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో సినిమాలలో నటిస్తూ అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత హీరోగా పరిచయమై ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ని అందుకున్నారు అదంతా కేవలం అర్జున్ రెడ్డి సినిమాతోనే సాధ్యమైందని చెప్పవచ్చు ఇక ఈ సినిమా తర్వాత కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న లైగర్ సినిమాలో నటించారు.

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్. ఇక ఈ చిత్రంపై అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.లైగర్ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్నది. ముఖ్యమైన పాత్రలో మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. ఇక రమ్యకృష్ణ కూడా ఇందులో మాస్ పాత్రలో నటించబోతోంది. ఈ చిత్రం ఒకేసారి తెలుగు,హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో విడుదల కాబోతోంది.ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో చాలా బిజీగా పాల్గొన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలను కూడా చుట్టుముట్టి రావడం జరిగింది.

ఇక లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉండడం గమనార్హం. ఇక విజయ్ అలా పలు ప్రాంతాలలో పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను కూడా తెలిపారు ఈ సినిమా కోసం తన ఒక సంవత్సరం నర్రపాటు.. మంచి డైట్ ఫాలో అయ్యానని తెలిపారు గంటల తరబడి జిమ్ములో వర్కౌట్లు చేస్తూ తన ఫిజిక్కుని ఇలా మార్చుకున్నాను అని తెలిపాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చాలా కష్టపడి క్రమశిక్షణగా వర్కౌట్ చేశానని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం మందు కూడా మానేశానని తెలిపారు కఠినంగా ఈ సినిమా కోసం ఉండవలసి వచ్చింది అని తెలిపారు విజయ్. మరి ఈ సినిమా సక్సెస్ తో తన పడిన కష్టానికి ఫలితం దక్కుతుందేమో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.