లైగర్ స్టోరీ లీక్.. వైరల్ అవుతున్న కథ..

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెర రక్కబోతున్న చిత్రం లైగర్. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో లైగర్ సినిమాకు సంబంధించి ఒక వార్త తెగచక్కర్లు కొడుతోంది.అదేమిటంటే లైగర్ సినిమా అసలు కథ ఇదే అంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.

ఇక అసలు కథ ఏమిటి అన్న విషయంలోకి వెళ్తే.ఈ సినిమా రవితేజ హీరోగా నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా కాన్సెప్ట్ తో ఉండబోతుందని తెలుస్తోంది.ఆ సినిమా తరహాలోని ఈ లైగర్ కథ కూడా సాధనుందట.కరీంనగర్ కి చెందిన రమ్యకృష్ణ కొన్ని కారణాలతో ముంబై వెళ్ళిపోతుంది.అక్కడ ఓ స్లమ్ ఏరియాలో టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తుంది.ముంబై లాంటి నగరంలో బ్రతకాలంటే తెగువ, ధైర్యం ఉండాలని రూత్ లెస్ లేడీగా మారుతుంది రమ్యకృష్ణ.

ఇక తన కొడుకు ను కూడా అలానే పెంచుతుంది.అలా సినిమాలో విజయ్ ముంబై స్లమ్ ఏరియాలో పెరిగిన విజయ్ రౌడీగా పెరుగుతాడు.విజయ్ ఎప్పుడూ ఏదో ఒక గొడవలో తలదూర్చుతూ, తల్లి రమ్యకృష్ణకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు.లోకల్ గ్యాంగ్స్ తో కూడా విజయ్ కి గొడవలు జరుగుతూ ఉంటాయి.ఈ క్రమంలో విజయ్ ఫైటింగ్ నేర్చుకోవాలి అనుకుంటాడు.అప్పుడు విజయ్ ఏరియాలో ఉండే కోచ్ దగ్గర మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు.

అయితే విజయ్ అందులో విజయ్ మంచి ప్రతిభ చూపిస్తాడు.కాగా ఈ విషయం తల్లి రమ్యకృష్ణకు తెలియదు.దానితో క్రుంగిపోయిన విజయ్ కెరీర్ వదిలేసి వీదుల్లో తిరుగుతూ ఉంటారు.దానితో రమ్యకృష్ణ మళ్ళీ ఫైటర్ కావడం ద్వారానే సెట్ అవుతాడని ప్రాక్టీస్ మొదలు పెట్టమనీ చెబుతుంది.విజయ్ మాత్రం నేను ఇక ఫైట్ చేసేది లేదనీ చెప్పడంతో అప్పుడు రమ్యకృష్ణ తన తండ్రి గురించి షాకింగ్ విషయాలు వెల్లడిస్తుంద.అప్పుడు తన గతం తెలుసుకున్న విజయ్ ఏం చేశాడు? అతడు మళ్ళీ ఫైటర్ అయ్యాడా? లేదా?ఇంటర్నేషనల్స్ లో గెలిచి తన కల నెరవేర్చుకున్నాడా? ఈ తల్లీ కొడుకుల కథ ఎలా ముగిసింది అనే అంశం పై ఈ సినిమా తెరకెక్కబోతోంద.అయితే ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే చాలామంది ఇదేఅసలు కథ ఏమో అని భావిస్తున్నారు.మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేసి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.