విడాకులకు సిద్ధమైన మరో స్టార్ హీరోయిన్?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడాకుల పరంపర కొనసాగుతుంది.ఎక్కువగా సెలబ్రిటీలు చిన్నపాటి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని విడిపోతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.తాజాగా మరొక నటి కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ముస్తఫా రాజ్ అప్పటికే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తనకు విడాకులు ఇచ్చిన అనంతరం ప్రియమణిని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు.అయితే ముస్తఫా రాజ్ మొదటి భార్య నాకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని పెళ్లి చేసుకున్నారని ఈ పెళ్లి చెల్లదు అంటూ పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు.

ఈ విధంగా ప్రియమణి ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.అయితే వీరి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పిల్లలు లేకపోవడంతో తరచూ వీరిద్దరి మధ్య పిల్లల గురించి గొడవలు మొదలయ్యాయనే వార్తలు వస్తున్నాయి.ఇలా పిల్లల కోసమే ఈ జంట గొడవపడి చివరికి విడాకుల వరకు వచ్చారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా ప్రియమణి విడాకుల గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ ప్రియమణి మాత్రం ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.