శేఖర్‌ మాస్టర్‌ కూతురు సాహితి హీరోయిన్‌ గా సినీ రంగ ప్రవేశం.

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తరువాత తనకంటూ ఉన్న టాలెంట్ తో మంచి పేరు సంపాదించారు.
అనేకమంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలోనే బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించాడు. ఒకపక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోపక్క బుల్లితెరపై కొన్ని షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. ఆ సమయంలోనే తన కుమారుడు విన్నీ, కుమార్తె సాహితిని కూడా బుల్లితెర ప్రేక్షకులకు అలవాటు చేశాడు. కామెడీ షోలు, డాన్స్ షోలు, పండుగ ఈవెంట్లు అవీ ఇవీ అని లేకుండా పేరుతో సాహితీ, విన్నీ ఇద్దరు కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇద్దరికీ జనాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. విన్నీ అయితే ఇటీవల విడుదలైన అంటే సుందరానికి సినిమాలో చిన్ననాటి నాని పాత్రలో కూడా నటించి మెప్పించాడు. ఇక శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితికి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆమె పేరుతో ఆ మధ్య ఫేక్ ఐడీలు కూడా సృష్టించారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా శేఖర్ మాస్టర్ హెచ్చరించారు. అయితే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అది ఏమిటి అంటే శేఖర్ మాస్టర్ కుమార్ సాహితి త్వరలోనే తెలుగు హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేయబోతుందని తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కుమార్తెగానే పరిచయమైనా తన డాన్స్ తో టిక్ టాక్ వీడియోలతో సాహితి కూడా మంచి పేరు సంపాదించింది.

చూడటానికి చక్కగా కుందనపు బొమ్మలా ఉండే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే ఒక కొత్త దర్శకుడు ఆమెకు కథ చెప్పారని శేఖర్ మాస్టర్ కు కూడా కథ నచ్చడంతో ఆమెతో సినిమా చేసేందుకు డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. డైరెక్టర్ కొత్తవాడు అయినా మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోను సినిమాలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ తన పరిచయాలను ఉపయోగించి మీడియం రేంజ్ హీరోలకు దర్శకుది చేత కథ చెప్పిస్తున్నారనే ప్రచారం టాలీవుడ్ లో జోరుగా జరుగుతోంది. నిజానికి ఇప్పటికే సాహితీ, విన్నీ ఇద్దరూ కూడా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు సాహితీ హీరోయిన్గా మారే అవకాశం ఉందని వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది

Leave A Reply

Your email address will not be published.