సరిగమప షో విన్నర్ శృతిక సముద్రాల..

జీతెలుగులో దాదాపు నాలుగు నెలలకు పైగా ప్రసారమయిన ‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్’ కార్యక్రమం ఆదివారంతో ముగిసినది. ఎంతోమంది సింగర్స్ ని పరిచయం చేసి, వాళ్ళకి ఒక ప్లాట్ ఫామ్ కలిపించింది ఈ షో. ఈ షో ద్వారా పరిచయమైన వాళ్ళు సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. ఈ షో తాజా సీజన్ ఆదివారంతో ముగియగా గ్రాండ్ ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనతో హైదరాబాద్‌కు చెందిన శృతిక సముద్రాల ‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్’ టైటిల్ విజేతగా నిలిచింది. వెంకటసుధాన్షు రన్నరప్‌గా నిలిచాడుది సింగింగ్ సూపర్ స్టార్ ట్రోఫీని జడ్జీలు కోటి, అనంత శ్రీరామ్, శైలజ, స్మిత శృతికకి అందించారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా చేసేందుకు లెజెండరీ సింగర్ పి. సుశీల, సూపర్ స్టార్ శృతిహాసన్, నితిన్, కృతి శెట్టిలు కూడా వచ్చారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం కూడా ఉండటంతో జవాన్లని సన్మానించి, స్పెషల్ పర్ఫార్మెన్స్ లని నిర్వహించారు.

 

విన్నర్ శృతికకి లక్ష రూపాయల నగదు మరియు మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా శృతిక మాట్లాడుతూ… ‘‘జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్ విన్నర్‌గా నిలవడం ఒక డ్రీం. ఇది ట్రూ మూమెంట్ గా మారి నా లైఫ్‌లోనే బెస్ట్ మూమెంట్ గా ఎప్పటికీ మరిచిపోలేని క్షణంగా నిలిచింది. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతోపాటు, నాతోటి ఫైనలిస్టులు కూడా అద్భుతంగా పాడారు కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో నాకు నా తోటి సింగర్లు, జీసరిగమప టీం, మెంటార్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లు ఎంతగానో సహకరించారు. వాళ్లందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను సింగర్‌గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేసిన మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీరామాచారి కొమండూరి గారికి, శ్రీనిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపింది. నెటిజన్లు, పలువురు సింగర్స్ శృతికకి అభినందనలు తెలియచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.