సినిమాలు వదిలెయ్యాలి అనుకున్నా.. అమలా పాల్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట తమిళ సినిమాతో మంచి గుర్తింపు ఏర్పరచుకున్న అమలాపాల్ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అలా అతి తక్కువ సమయంలోనే తెలుగు పేక్షకులకు బాగా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. కానీ పెళ్లి కారణంగా ఆమె కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంది. పెళ్లి తర్వాత విడాకులు కూడా అమలా పాల్ కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో పెళ్లి వల్ల ఆమె కెరియర్ కాస్త డల్ అయింది.

అయితే తెలుగులో నటించకపోయినప్పటికీ కూడా ఇతర భాషల్లో వరుసగా సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ దూసుకుపోతోంది. కాగా ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలాపాల్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నా కెరియర్ లో ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నాకు పాత్రల కోసం నేను వెంపర్లాడుతున్నట్టుగా, పరిగెడుతున్నట్టుగా అనిపించేది. అలాగే అందరికీ దూరంగా ఉంటున్నట్టుగా అనిపించేది.. అప్పుడు నాలో నేను చాలా మధన పడ్డాను అని చెప్పుకొచ్చింది అమలాపాల్.

ఆ సమయంలోనే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను అన్న విషయం అర్థం కాలేదు. ఆ క్షణమే సినిమాలను వదిలేయాలి అనుకునేంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అని తెలిపింది అమలాపాల్. అటువంటి సమయంలోనే నాన్నగారు చనిపోయారు. అప్పుడు కొన్ని భయాలు నన్ను మరింత వెంటాడాయి. ఆ సమయంలో నాకు నేను ఒక యోధురాలుగా అనుకుంటూ నాకు ఎదురైనా వాటిని ఇంటికి సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్లాను అని తెలిపింది అమలాపాల్. అయితే ప్రస్తుతం నా జీవితం సంతోషంగా ఉంది. నా పై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్క సందర్భంలో కూడా నన్ను నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన తీరు నాకు బాగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది అమలాపాల్.

Leave A Reply

Your email address will not be published.