సినిమా హిట్ అయినా నాకు బాధగానే ఉంది.. కార్తికేయ 2పై అనుపమ పరమేశ్వరన్ వ్యాఖ్యలు..

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్ కూడా సౌత్, నార్త్ అన్ని దిక్కులా బాగా వస్తున్నాయి. చిత్ర యూనిట్ వరుస సక్సెస్ మీట్స్ పెట్టి సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా కార్తికేయ 2 సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ సక్సెస్ మీట్ కి చిత్ర యూనిట్ తో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు కూడా విచ్చేశారు.ఈ ప్రెస్ మీట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. ”నేనెప్పుడూ స్టేజ్ మీద ఇంత టెన్షన్ పడలేదు.

 

ఈ రోజు స్టేజ్ మీదకి వస్తుంటే షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయింది కదా కానీ నువ్వెందుకు హ్యాపీగా లేవని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. నిజమే సినిమా హిట్ అయినా నేను హ్యాపీగా లేను. ఎందుకంటే సినిమా హిట్ అయిన ఆనందం కంటే కూడా కార్తీకేయ-2 జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది. ఆ బాధవల్లే నేను హిట్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను ఇన్ని రోజులు భరించినందుకు చందూ మొండేటి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.