స్టేజ్ మీదే ఛార్మీకి లవ్ యూ చెప్పిన పూరీ జగన్నాథ్..

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా మరో పది రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కగా యువత ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అటు విజయ్ దేవరకొండకు ఇటు పూరీ జగన్నాథ్ కు అవసరమైన సక్సెస్ ఈ సినిమాతో దక్కనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాకు కరణ్ జోహార్ తో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే వరంగల్ లో జరిగిన లైగర్ మూవీ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ వర్షం పడుతున్నప్పటికీ తడుచుకుంటూ వచ్చి నిలబడిన మీ అందరికీ లవ్యూ అని అన్నారు.ఆగష్టు 25వ తేదీన లైగర్ మూవీ రిలీజ్ కానుందని ఆయన చెప్పుకొచ్చారు.కరణ్ జోహార్ కు థాంక్స్ అని ఆయన కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

కరణ్ జోహార్ రాజులా బ్రతుకుతాడని ఆయనే మాకు సపోర్ట్ చేశాడని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.కొత్త డైరెక్టర్లు మంచి సినిమాలు తీస్తున్నారని నేను వెనుకబడ్డానని చెప్పి మా ఆవిడ అర్జున్ రెడ్డి డైరెక్టర్ గురించి చెప్పిందని పూరీ జగన్నాథ్ తెలిపారు.అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండను చూస్తూ అలా ఉండిపోయానని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.మైక్ టైసన్ తో పని చేసే ఛాన్స్ వచ్చిందని మేము చాలా లక్కీ అని పూరీ వెల్లడించారు.

సినిమా కోసం ఛార్మీ మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతుందని పూరీ పేర్కొన్నారు.ఛార్మీ ప్రొడక్షన్ లోనే కూర్చుని ఏడుస్తూ ఉంటుందని ప్రొడ్యూసర్లకు అన్ని కష్టాలు ఉంటాయని పూరీ అన్నారు.ఏ కష్టం ఉన్నా ఛార్మీ నాకు చెప్పకుండా విజయ్ కు చెబుతుందని పూరీ తెలిపారు.లవ్యూ ఛార్మీ అంటూ పూరీ జగన్నాథ్ ఛార్మీ కష్టాన్ని మెచ్చుకున్నారు.పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.