హాట్ టాపిక్‌గా ప‌విత్రా లోకేష్‌.. మ‌రోసారి వార్త‌ల్లో నిలిచిన న‌టి

రీసెంట్ టైమ్‌లో వార్త‌ల్లో నిలిచిన సినీ సెల‌బ్రిటీల్లో సీనియ‌ర్ న‌రేష్ (, ప‌విత్రా లోకేష్  ఉన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వి.కె.న‌రేష్ త‌న మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి (తో గొడ‌వ ప‌డిన సంద‌ర్భంలో ప‌విత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకుంటార‌నే వార్త‌లు బ‌లంగా వ‌చ్చాయి. ర‌మ్య ర‌ఘుప‌తి సైతం అదే మాటను మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. న‌రేష్‌..ప‌విత్రా లోకేష్‌.. ర‌మ్య ర‌ఘుప‌తి మ‌ధ్య గొడ‌వ‌లు తారాస్థాయికి చేరాయి. ఆ త‌ర్వాత ఏమైంద‌నేది మాత్రం బ‌య‌ట‌కు రాలేదు.ఈ క్రమంలో సీనియ‌ర్ న‌టిగా పేరున్న ప‌విత్రా లోకేష్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.

 

గొడ‌వ స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత మ‌ళ్లీ ప‌విత్రా లోకేష్ లొల్లి ఏంది? అనే సందేహాలు రాక మాన‌వు. అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌విత్రా లోకేష్ ఇప్పుడు వార్త‌ల్లో నిల‌వ‌డానికి కార‌ణం.. ఆమె రెమ్యున‌రేష‌న్‌. అస‌లే నిర్మాత‌లు అంద‌రూ ఏక‌మై న‌టీన‌టుల రెమ్యునరేష‌న్స్ విష‌యంలో కొన్ని నిర్ణ‌యాలు తీసుకుని త‌గ్గించాల‌ని అనుకుంటున్నారు.ఈ స‌మ‌యంలో ప‌విత్రా లోకేష్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను దాదాపు రెట్టింపు చేశార‌ట‌. ఇది వ‌ర‌కు ఆమె రోజుకి అర‌వై వేల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఛార్జ్ చేసేవారట‌. కానీ ఇప్పుడు దాన్ని ల‌క్ష రూపాయ‌లు చేశార‌ని టాక్‌. మ‌రి దీనిపై ప‌విత్రా లోకేష్ ఏమైనా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవుతారేమో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.