హీరోయిన్స్ అంటే దేవదాసిలే.. హాట్ యాంకర్ కామెంట్స్!

యాంకర్ అనసూయ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఓ పక్క బుల్లితెరపై టీవీ షోలను హోస్ట్ చేస్తూనే మరోపక్క వెండితెరపై అలరిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా లీడ్ రోల్స్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తోంది.

ఆమె నటించిన ‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి సినిమాలు అనసూయకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలు కూడా ఒప్పుకుంటుంది.

రీసెంట్ గా తమిళంలో ప్రభుదేవా దర్శకత్వంలో రెండు సినిమాలకు సైన్ చేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనపై జరిగే ట్రోలింగ్ పై ఘాటుగా రియాక్ట్ అవుతూ.. తరచూ వివాదాల్లో నిలుస్తుంటుంది. తాజాగా అనసూయ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ను ఎలా ట్రీట్ చేస్తారో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే అసలు మాట్లాడకూడదని.. ముఖ్యంగా హీరోయిన్స్ అంటే కెమెరా ముందు కాపాడండి అని అనాలి లేదంటే సిగ్గుపడి నవ్వాలి..అంతకముందు మాట్లాడకూడదని చెప్పుకొచ్చింది అనసూయ. గిల్లితే గిల్లించుకోవాలని ‘పోకిరి’ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి కూడా అంతే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో హక్కుల కోసం ఆడావాళ్లు నోరు విప్పితే ఇంట్రెస్ట్ పోతుందని.. ఇక్కడ హీరోయిన్స్ అంటే దేవదాసిలా పని చేయాలని.. అది చాలా తప్పు అంటూ తెలిపింది.

తను మాట్లాడకుండా ఉన్నాసరే తనవైపు వేలెత్తి చూపించిన వాళ్లు ఉన్నారని.. మాట్లాడితే తప్పు, మాట్లాడకుండా ఉంటే తప్పు.. ప్రతిసారి మాట్లాడడం అవసరమా..? అని కొన్నాళ్లపాటు తనకు తాను నచ్చజెప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది అనసూయ.

Leave A Reply

Your email address will not be published.