హీరోయిన్ త్రిషను చూశారా.. ఎంత అందంగా ఉందో…

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో నటన, అందం విషయంలో టాప్ హీరోయిన్ లలో మొదటి స్థానంలో ఉన్న ముద్దుగుమ్మ త్రిష.తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ల మనసులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటులను, దర్శక నిర్మాతలను కూడా ఫిదా చేసింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా ఈమెకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.తెలుగు సినీ ఇండస్ట్రీకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో 2003లో అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా మాత్రం తనకు అంత సక్సెస్ ఇవ్వలేదు.కానీ ఆ తర్వాత ఆమె నటించిన వర్షం సినిమా మాత్రం ఆమె కెరీర్ నే మార్చేసింది.ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించగా.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించింది.ఇక ఈమెకు పలు అవార్డులు కూడా అందాయి.ఈమె అందాల పోటీలలో కూడా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎన్నికయింది.

గతంలో సినీ ఇండస్ట్రీకి దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో పలు సినిమాలలో నటిస్తుంది.ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే గతంలో ఈమెకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి.ఈమె గతం లో ఓ బిజినెస్ మాన్ ను కూడా నిశ్చితార్థం చేసుకుంది.కానీ ఏం జరిగిందో ఏమో పెళ్లి సమయానికి వారి మధ్య బ్రేకప్ జరిగింది.ఇక ఆ మధ్య తమిళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవ్వడంతో అందులో తాను ఈ వయసులో కూడా చాలా అందంగా ఉంది.ఆ ఫోటోలో తన తల్లితో పాటు తాను కూడా ఉంది.ఇక ఈ ఫోటోను చూసిన తన అభిమానులు తెగ లైక్ లు కొడుతున్నారు.ఈ వయసులో కూడా త్రిష మునుపటి అందంతో మెరిసిపోతుంది అని కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ చెరగని అందంతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది.ఇక రీ ఎంట్రీ తో బాగా అవకాశాలు అందుకుంటుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.సోషల్ మీడియాలో తనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Leave A Reply

Your email address will not be published.