హీరో శ్రీవిష్ణుకు డెంగీ జ్వరం.. ఆసుపత్రిలో చికిత్స!

Actor Srivishnu Hospitalized టాలీవుడ్ యంగ్ హీరోలలో శ్రీవిష్ణుది ఒక పత్యేకమైన శైలి అని చెప్పుకోవచ్చు. ఒకే విధమైన సినిమాలు కాకుండా… విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ, వరుస సినిమాలతో ప్రేక్షకులకు ఆయన వినోదాన్ని పంచుతున్నారు. ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకున్న శ్రీవిష్ణు… ప్రస్తుతం ‘అల్లూరి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న తరుణంలో… ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో, షూటింగ్ కు అంతరాయం కలిగింది.

శ్రీవిష్ణు గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సాధారణ జ్వరమే అనుకుని కొన్ని రోజుల నుంచి ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అయితే జ్వరం తీవ్రత పెరగడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనను కుటుంబ సభ్యులు చేర్చారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ అని నిర్ధారణ అయింది. ఆయనకు ప్లేట్ లెట్స్ కూడా పడిపోయాయి. దీంతో సంబంధిత చికిత్సను చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.